Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగ విద్యార్థులు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి 

దివ్యాంగ విద్యార్థులు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి,మహిళ, శిశు, దివ్యాంగుల వయో వృద్దుల శాఖ, అధికారి రసూల్ బి బుధవారం ప్రకటనలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరమునకు ఉపకార వేతనములు 9వ తరగతి, 10వ తరగతి చదువులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనములు, ఇంటర్మీడియట్ లేదా ఆపై ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనములు జాతీయ స్థాయిలో మంజూరు చేయుటకు గాను దరఖాస్తు చేసుకోనవలసినదిగా ఆదేశాలు జారీచేసియున్నారు.  కావున ఆర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 9వ తరగతి 10వ తరగతి చదువులు చదువుతున్న ప్రీమెట్రిక్ దివ్యంగ విద్యార్థులు, ఇంటర్మీడియట్ లేదా ఆపై చదువులు చదువుతున్న పోస్టు మెట్రిక్ దివ్యంగ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (www.scholarships.gov.in) వెబ్ సైట్ నందు సంబందిత అన్ని ద్రువపత్రములతో దరఖాస్తు చేసుకోనవలసినదిగా తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -