ట్రాక్టర్‌ను డీసీఎం ఢకొీనడంతో ఇద్దరు మృతి
సాగర్ ఎడమ కాలువలో తండ్రీకొడుకు గల్లంతు
నవతెలంగాణ- పెబ్బేరు/ వేములపల్లి
వినాయకుడి నిమజ్జన కార్యక్రమాల్లో విషాద ఘటనలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి తండ్రీకొడుకు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ట్రాక్టర్‌ను వెనుక నుంచి డీసీఎం ఢకొీట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. వనపర్తి మండలం నాచహళ్లి గ్రామానికి చెందిన 11 మంది యువకులు బీచుపల్లి దగ్గర గణేష్ నిమజ్జనం ముగించుకొని తిరిగి ట్రాక్టర్‌లో స్వగ్రామానికి వస్తుండగా.. రంగాపూర్ దాటిన తర్వాత డీసీఎం వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢకొీట్టింది. దీంతో ట్రాక్టరు డ్రైవర్ పక్కన కూర్చున్న వారిలో సాయి(25), శంకర్(28) కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. అబ్దుల్లా, విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు.
తండ్రీకొడుకు గల్లంతు
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్‌ఎడమ కాలువలో వినాయకుని నిమజ్జనం చేయడానికి వచ్చి తండ్రీకొడుకు గల్లంతయ్యారు. మాడుగులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన పున్న సాంబయ్య(46), పున్న శివమణి(20) గ్రామస్తులతో కలిసి వినాయక విగ్రహం వెంట నిమజ్జనానికి వచ్చారు. నిమజ్జనం అనంతరం తండ్రి, కొడుకు ఒంటిపై ఉన్న రంగులను కడుక్కోవడానికి కాలువలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సాంబయ్య జారి లోపలికి పడిపోయాడు. కొడుకు తన పాయింట్‌ను తండ్రికి అందించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా శివమణి కూడా కాలువలోకి పడిపోయాడు. బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఇద్దరూ నీటమునిగిపోయారు. ఆచూకీ తెలియలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES