విభజన హామీల విస్మరణ.. ఆర్థిక సంఘం నిధుల్లో కోత
అమరావతి : కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరోసారి నిరాశను మిగిల్చింది,విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వే జోన్, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి, ఐఐఎస్‌ఈఆర్, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్, విజయవాడ మెట్రో, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని అమరావతి ఇలా అన్ని కీలకాంశాలకు కేంద్రం మొండి చెయ్యి చూపింది. పోలవరం ప్రాజెక్టుకు కూడా ఆశించినంతగా నిధులు రాలేదు.జ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేటాయింపులు ఏమీ చేయలేదు. 2024-25 బడ్జెట్ లో రూ.8,622 కోట్లు కేటాయించారు. 2025-26 బడ్జెట్ లో రూ.3,017.01 కోట్లకు తగ్గించారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.100 కోట్లతో సరిపెట్టింది. విశాఖపట్నం పోర్టుకు సంబంధించి గత 2025-26 బడ్జెట్ లో రూ.730 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్ లో రూ.450 కోట్లకు కేటాయింపులు తగ్గించారు. అలాగే పెట్రోలియం యూనివర్శిటీకి రూ.రూ.302 కోట్లు కేటాయించింది. పట్టణ, గ్రామీణ ప్రారతాల అభివృద్ధికి కీలకమైన ఆర్థిక సంఘం నిధుల్లో భారీ కోతలు పడ్డాయి. గతేడాది కన్నా ఈ నిధులు దేశ వ్యాప్తంగా 24 వేల కోట్లు తగ్గాయి. గత ఏడాది రు. 1,52,953 కోట్లు దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయగా, ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం 1,29,397 కోట్లు మాత్రమే కేటాయిరపులు చేయాలని నిర్ణయిరచారు. ఈ మేరకు రాష్ట్రానికి కోత పడనుంది.
వైపరీత్యాల నిధులకు వాత
అత్యరత కీలకమైన ప్రకృతి వైపరీత్యాల నివారణకు కేటాయిరచాల్సిన నిధులపై మాత్రం భారీగానే కోతలు విధిరచారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు గత ఏడాది 24 వేల కోట్లు వరకు కేటాయిరచగా ఈ ఏడాది రెరడు వేల కోట్ల వరకు కోతలు పెట్టారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ నిధుల్లో కూడా నాలుగు వేల కోట్ల వరకు కోతలు పడ్డాయి. ఆరోగ్య నిధులు, పట్టణ సేవలు, ఆదాయలోటు నిధులకు ఒక్క రూపాయి కూడా కేటాయిరపులు చేయలేదు.
ఏపీకి నిరాశే
- Advertisement -
- Advertisement -



