0-5తో సెమీస్‌లో ఓటమి
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
ఉలాన్బాతర్ (మంగోలియా) : భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ మరోసారి నిరాశ పరిచింది. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న నిఖత్ జరీన్..పసిడి పోరుకు చేరుకోలేదు. పారిస్ ఒలింపిక్స్ చాంపియన్, చైనా బాక్సర్ వు యు 5-0తో నిఖత్ జరీన్‌పై స్పష్టమైన విజయం సాధించింది. మహిళల 51 కేజీల విభాగంలో పసిడి పతక ఫేవరేట్‌గా బరిలోకి దిగిన నిఖత్ జరీన్ సెమీస్‌లో ఓటమితో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల విభాగంలో ప్రీతీ పవార్, అరుంధతి చౌదరి, ప్రియ పసిడి పోరుకు చేరుకున్నారు. 54 కేజీల సెమీస్‌లో దక్షిణ కొరియా బాక్సర్ ఏజిపై 5-0తో ప్రీతీ పవార్, 60 కేజీల సెమీస్‌లో మంగోలియా బాక్సర్ నమున్‌పై 5-0తో ప్రియ, 70 కేజీల సెమీస్‌లో టోయిరొవ (ఉబ్బెకిస్తాన్)పై 4-1తో అరుంధతి చౌదరి విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ 75 కేజీల విభాగంలో ఉబ్బెకిస్తాన్ బాక్సర్ చేతిలో 0-5తో ఓటమి పాలైంది.



