ఎన్నికలు వాయిదా పడడంతో అసంతృప్తి
ఒక్కసారిగా తగ్గిన రాజకీయ వేడి
నవతెలంగాణ – పాలకుర్తి
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఆశావహులందరికీ నిరాశే మిగిలింది. ఈనెల 8న హైకోర్టులో 42 శాతం బీసీ రిజర్వేషన్ పై వాదనలు జరగడంతో కొంత ఊపిరి పీల్చుకున్న బీసీ నేతలకు బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నిరాశ చెందారు. ఎన్నికలు జరుగుతాయో లేదో ప్రజలు ఉన్నప్పటికీ కోర్టు తీర్పుతో డీలపడ్డారు. నాలుగు వారాలపాటు ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రధాన పార్టీలో ఉన్న ఆశావాహులందరికీ అసంతృప్తి మిగిలింది.
ప్రధానోపాధ్యాయులకు రాజకీయ నాయకులు పోటాపోటీగా ఎంపీటీసీ క్లస్టర్ల వారిగా సమావేశాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పుకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎంపీటీసీల అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. కోర్టు తీర్పుతో ఒక్కసారిగా రాజకీయ వేడి తగ్గింది. హైకోర్టు తీర్పు అనంతరం నాలుగు వారాల వాయిదాలతో రిజర్వేషన్లలో ఏమైనా మార్పులు ఉంటాయ అనే సందిగ్ధంలో ఆశావాహులు ఉన్నారు. ఏది ఏమైనాప్పటికీ హైకోర్టు తీర్పుతో ఆశావాహులు కొంత నిరాశ చెందినప్పటికీ మరి కొంతమందిలో ఊపిరి పీల్చుకున్నట్లు చర్చ జరుగుతుంది. ఎంపీటీసీలుగా ఎవరు ఉండాలనేది జాబితాను రూపొందించుకున్నారు.
ఆశావాహులకు నిరాశే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES