ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్
నింగ్బో (చైనా) : ఐఎస్‌ఎఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల తడబాటు కొనసాగుతుంది. షూటింగ్ ప్రపంచకప్ అంతిమ అంకంలో టీమ్ ఇండియా షూటర్లు ఇప్పటివరకు ఒక్క విభాగంలోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. గత ప్రపంచకప్ పోటీల్లో పతకాల పంట పండించిన మనోళ్లు ఈసారి అనూహ్యంగా తేలిపోతున్నారు. గురువారం జరిగిన పిస్టల్, రైఫిల్ ఈవెంట్ పోటీల్లోనూ ఇదే వ్యథ కొనసాగింది. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం అర్హత రౌండ్‌లో దివ్యాన్షు సింగ్ పన్వార్ 630 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో ఉమామహేశ్, నీరజ్ కుమార్‌లు 39, 54వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ర్యాపిడ్ ఫైర్ అర్హత రౌండ్‌లో అద్భుత రీతిలో తొలుత 295 పాయింట్లు సాధించిన అశోక్ పాటిల్.. రెండో రౌండ్లో అంచనాలను అందుకోలేక ఓవరాల్‌గా 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూరమయ్యాడు. షఉటింగ్ ప్రపంచకప్‌లో ఆతిథ్య చైనా రెండు పసిడి పతకాలతో మెడల్స్ వేటలో ముందంజలో నిలువగా.. నార్వే, ఇటలీ, దక్షిణ కొరియా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
షూటింగ్‌లో నిరాశే
- Advertisement -
- Advertisement -