Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్తూర్పుగోదావరిలో ఘోరం

తూర్పుగోదావరిలో ఘోరం

- Advertisement -

– లారీని ఢీకొన్న కారు
– ఐదుగురు దుర్మరణం

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఎడిబి రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాజానగరం మండలం రఘనాధపురం గ్రామానికి చెందిన రేలంగి శివన్నారాయణ, ఆయన భార్య దేవి, కుమార్తెలు హర్షిత, వర్షిత, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడుంగొయ్యిలో నివాసం ఉంటున్న బావమరిది తీగిరెడ్డి శివ, ఆయన భార్య భవాని, కుమార్తె సాన్వితో కలిసి కారులో సోమవారం ఉదయం కాకినాడ బీచ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రంగపేట మండలం వడిశలేరు పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు ఢ కొన్నది. ఈ ప్రమాదంలో శివన్నారాయణ (45), దేవి (32), హర్షిత (12), శివ (42), సాన్వి (5) అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలైన భవాని, వర్షిణిలను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రంగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad