Saturday, November 1, 2025
E-PAPER
Homeఖమ్మంక్రమశిక్షణే విజయానికి నాంది: ప్రిన్సిపాల్ అనిత

క్రమశిక్షణే విజయానికి నాంది: ప్రిన్సిపాల్ అనిత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట; కళాశాల విద్యలో  క్రమశిక్షణతో చదువుకొని,లక్ష్యం నిర్దేశించుకున్న విద్యార్థులే  ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ప్రిన్సిపాల్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత అన్నారు. శనివారం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్  అనిత అధ్యక్షతన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఏరోజు పాఠ్యాంశాలను అదే రోజు చదువుతూ,ముఖ్యమైన అంశాలను తరుచు నోట్స్ లా రాసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుందని సూచించారు.

ముఖ్య వక్త గా హాజరైన బాలికోన్నత పాఠశాల గణిత బోధకురాలు ఎస్.జ్యోతి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలబడాలి అంటే విశ్రమించకుండా నిరంతరం చదువుతూ.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఇప్పటినుండే ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని అన్నారు. అబ్దుల్ కలాం పేదరికం నుండి ఉన్నత శిఖరాలకు శాస్త్రవేత్త గాను, భారత రాష్ట్రపతిగా ఆయన ఎదిగిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవాలని అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకో గలరని సూచించారు. ఈ కార్యక్రమంలో  భద్రాద్రి జిల్లా ఏజీఎంఓ అరవింద్ బాబు,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు,అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -