పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి
మాదాపూర్ ఎస్సై జేవేందర్ నాయక్
నవతెలంగాణ – మిడ్జిల్
ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడతారని మాదాపూర్ ఎస్సై జేవేందర్ నాయక్ చెప్పారు. బుధవారం మండలంలోని వస్పుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు విద్యపై ఏర్పాటు చేసిన సమావేశానికి హైదరాబాదులోని మాదాపూర్ ఎస్సై జేవేందర్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలోని తుల్జా నాయక్ తండాలో పుట్టి పెరిగి ప్రభుత్వ పాఠశాలలోని చదువుకొని ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని విద్యార్థులకు తెలిపారు. చదువుతోపాటు క్రీడలలో రాణించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అనుభవజ్ఞలైన అధ్యాపకులుఉన్నారని చెప్పారు.
విద్యార్థులలోని నైపుణ్యతను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి వారు ఎదుగుదలకు కృషి చేయాలని అన్నారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గ్రామానికి మండలానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే బాధ్యత విద్యార్థుల పైన ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని పేదరికానికి విద్య అడ్డు రాదని ఎంతోమంది నిరుపేదలు విద్య ద్వారా ఉన్నత పదవులలో ఉన్నారని చెప్పారు.
విద్యార్థులు కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిలను సర్పంచులు రాములమ్మ, దోనూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బాలయ్య ఉప సర్పంచ రాఘవేందర్ రెడ్డి, నాయకులు రమేష్ నాయక్ చైర్మన్ ప్రసన్న ఉపాధ్యాయులు భాను ప్రకాష్, కృపారాణి, తారా సింగ్, నిమ్మయ గౌడు, రేణుక, బసవయ్య, శంకర్ కల్పన, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



