Thursday, November 20, 2025
E-PAPER
Homeఖమ్మంరాయితీ వేరుశనగ కాయలు సిద్ధం

రాయితీ వేరుశనగ కాయలు సిద్ధం

- Advertisement -

కానీ గింజల పై ఆసక్తి కనబరుస్తున్న రైతులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పధకం ఏదైనా — ప్రభుత్వం శాస్త్రీయ,సాంకేతిక ప్రమాణాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే లబ్ధిదారులు మాత్రం ఆచారం, సంప్రదాయాలకు అలవాటు అయిపోయి కొత్త పద్ధతులను పెద్దగా స్వీకరించరు. ఇదే పరిస్థితి ఇప్పుడు వేరుశనగ సాగులో కనిపిస్తోంది. ఎన్.ఎఫ్.ఎస్.ఎం (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ – జాతీయ ఆహార భద్రత పథకం)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం రాయితీపై రైతులకు పంపిణీ చేయడానికి వేరుశనగ కాయల సంచులు ఈసారి పెద్ద మొత్తంలో సిద్ధం చేశారు. ఇవన్నీ ఇప్పటికే ప్రతి రైతు వేదిక కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.

అయితే స్థానిక వ్యవసాయ పరిస్థితుల్లో ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతోంది. మన ప్రాంత రైతులు సాధారణంగా టేగ్ – 24 రకం వేరుశనగ గింజలను విత్తడం అలవాటు. కానీ ఈసారి సరఫరా చేసినవి కదిరి లేపాక్షి వంగడం కు చెందిన కాయలు. రైతులు తమ పొలాలకు అలవాటు అయిపోయిన రకాలు నే నమ్ముతారు. అందువల్ల కొత్త రకం కాయల పై ఆసక్తి చూపడం లేదన్నది వినికిడి.

ప్రస్తుతానికి రైతు వేదికల్లో 62 క్వింటాళ్ల వేరుశనగ కాయలు సిద్ధంగా ఉన్నా… గతేడాది మండలంలో సుమారు 1000 ఎకరాల్లో వేరుశనగ సాగు జరిగింది. ఇంత పెద్ద విస్తీర్ణానికి 62 క్వింటాళ్లు ఏ విధంగానూ సరిపోవని, అందరూ లబ్ధి పొందేలా సరఫరా ఉండాలని పలువురు రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం ఒక వైపు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తుండగా… రైతులు మాత్రం తమ సంప్రదాయ రకాలను వదిలి కొత్త గింజల పై మొగ్గు చూపేందుకు ఇంకా వెనుకడుగే వేస్తున్నారు. రాబోయే సీజన్‌ లో ఈ రకం వంగడం రైతుల విత్తనాల ఎంపికపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -