మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ భవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళలు ఎంత స్థాయికి ఎదిగినా సమాజంలో వారు వివక్షను ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారంపై బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బుక్‌లెట్ తీసుకొస్తామని చెప్పారు. కేసీఆర్ మహిళా పక్షపాతిలా ఆలోచించి వారి కోసం ఎన్నో పథకాలు తెచ్చారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ లాంటి పథకాలు మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయని వివరించారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు అందరం కృషి చేద్దామని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను కోటీశ్వరులు చేస్తామంటున్నదనీ, కానీ ఎవ్వరూ లక్షాధికారులు కూడా కాలేదని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేదాకా పెండ్లి చేసుకోవద్దని కేటీఆర్ చెప్పిన మాటలు అనుసరిం చదగ్గవని అన్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత పదవిని మహిళకు ఇవ్వడం చాలా అరుదు అనీ, తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవా దాలు చెప్పారు.
ఏ స్థాయికి ఎదిగినా మహిళలపై వివక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



