వివిధ శాఖల గెజిట్ నోటిఫికేషన్లను టేబుల్ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనసభలో సోమవారం హైదరాబాద్ ఇండిస్టీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ (హిల్ట్) పాలసీపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ శాఖలకు చెందిన గెజిట్ నోటిఫికేషన్లను ఉభయ సభల్లో టెబుల్ చేయనున్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీస్, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమెండ్‌మెంట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి తుమ్మల ఉభయ సభల్లో ఉంచనున్నారు. తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయిమెంట్స్ టూ పబ్లిక్ సర్వీసెస్ అండ్ పే స్ట్రక్చర్ అమెండ్‌మెంట్ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉభయ సభల్లో ప్రవేశ పెట్టనున్నారు. మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ శాఖ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం సభ ప్రారంభం కాగానే శాసన సభ, మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టనున్నారు.



