Friday, April 10, 2026
E-PAPER
Homeబీజినెస్డిస్నీలో 1,000 మంది ఉద్యోగులపై వేటు

డిస్నీలో 1,000 మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -

వాషింగ్టన్‌ : ప్రముఖ వినోద రంగ దిగ్గజం వాల్ట్‌ డిస్నీ రానున్న వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ఈ తొలగింపులు ప్రధానంగా కంపెనీ మార్కెటింగ్‌ విభాగంపై ప్రభావం చూపనున్నాయి. గత మార్చిలో డిస్నీ సీఈఓగా జోష్‌ డి అమరో బాధ్యతలు చేపట్టకముందే ఈ కోతలకు సంబంధించిన ప్రణాళికలు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 2,31,000 మంది ఉద్యోగులు ఉండగా.. తాజా నిర్ణయం మొత్తం సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ మందిపై ప్రభావం చూపనుంది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రాజెక్ట్‌ ఇమాజిన్‌ పేరుతో మార్కెటింగ్‌ విభాగాలను ఏకం చేసేందుకు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అసద్‌ అయాజ్‌ కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -