- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారం జాతరలో అద్దె గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబాబాద్‌కు చెందిన భక్తులకు, రెడ్డిగూడెంలోని ఓ ఇంటి యజమానికి మధ్య కిరాయి డబ్బుల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో రెండు ఆటోలు, ఒక బైక్ ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భక్తులపై లాఠీఛార్జ్ చేసి చెల్లాచెదురు చేశారు. ఘర్షణకు దిగిన వారిని పరిగెత్తించి కొట్టడంతో జాతరలో కాసేపు భయాందోళనలు నెలకొన్నాయి.
- Advertisement -



