నవతెలంగాణ – పెబ్బేర్: వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గణేష్ శోభయాత్రలో రంగాపురం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 1:35గంటల సమయంలో పాత గురుదత్త దాబా వద్దా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలకు వెళితే.. హైదరాబాద్ వైపు వెళుతున్న రోడ్డుపై వనపర్తి మండలం నాచహళ్లి గ్రామానికి చెందిన 13మంది యువకులు బీచుపల్లి దగ్గర గణేష్ నిమజ్జనం ముగించుకొని తిరిగి గ్రామానికి ట్రాక్టర్ లో వెళుతున్నరు. ఈ క్రమంలో రంగాపూర్ దాటిన తర్వాత పాత గురుదత్త దాబా దగ్గర వెనకాల నుంచి వస్తున్న డీసీఎం (AP39x1678) నెంబర్ ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీ కొట్టింది. డీసీఎం డ్రైవర్ అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనకాల నుంచి ఢీకొట్టడం వల్ల ట్రాక్టర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి 5గురి లో ఇద్దరు వ్యక్తులు అక్కడక్కడ మృతి చెందారు. మృతి చెందిన వారు సాయి (25),శంకర్(28)లు మరో ఇద్దరు యువకులు అబ్దుల్లా, విష్ణు
తీవ్ర గాయాలతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం..
గణేష్ శోభాయాత్రలో అపశృతి.. ట్రాక్టర్ ను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES