Thursday, March 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్యాస్‌ సరఫరాకు అంతరాయం

గ్యాస్‌ సరఫరాకు అంతరాయం

- Advertisement -

గుజరాత్‌లోని మోర్బిలో నిలిచిన 430 సిరామిక్‌ యూనిట్లు
20 నుంచి 25 రోజులపాటు మూసివేత
వెల్లడించిన పరిశ్రమల ప్రతినిధులు

మోర్బి: పశ్చిమాసియాలో సంఘర్షణ కారణంగా తయారీ ప్రక్రియకు అవసరమైన గ్యాస్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గుజరాత్‌లోని మోర్బిలో ఉన్న 430 సిరామిక్‌ యూనిట్లు కనీసం మూడు వారాల పాటు పని చేయవని పరిశ్రమల ప్రతినిధులు పేర్కొం టున్నారు. సిరామిక్‌ నగరంగా , ప్రపంచంలోనే సిరామిక్‌ టైల్స్‌ ఉత్పత్తికి రెండవ అతిపెద్ద కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మోర్బిలో, మొత్తం 670 ఫ్యాక్టరీలలో దాదాపు 450 ఇప్పటికే గ్యాస్‌ కొరత కారణంగా తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మూసివేత అంచున ఉన్నాయని అధికారులు తెలిపారు. సిరామిక్‌ పరిశ్రమ తన కార్యకలాపాల కోసం, ముఖ్యంగా బట్టీలను కాల్చడానికి, ఆరబెట్టే ప్రక్రియల కోసం ప్రొపేన్‌ లేదా సహజ వాయువుపై ఎక్కువగా ఆధార పడుతుంది. ”గుజరాత్‌లోని మోర్బిలో పని చేస్తున్న సిరామిక్‌ యూనిట్ల ప్రత్యేక సమావేశం మంగళ వారం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 430 యూనిట్ల యజమానులు గ్యాస్‌ సంక్షోభం, ఇతర అనుబంధ సమస్యలపై సంప్రదిం పులు జరిపి, తమ ఫ్యాక్టరీలను మూసివేయాలని సమిష్టిగా నిర్ణయించుకున్నారు” అని మోర్బి సిరామిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మనోజ్‌ అర్వాడియా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -