నవతెలంగాణ – మల్హర్ రావు
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓసిపిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి,మైన్ మేనేజర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజుకు 6000 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, లక్ష క్యూబిక్ మీటర్ల ఓబి మట్టి వెలికితీత పనులు సాగుతాయని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఓసీపీలోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిసిపోయిందన్నారు. మైన్ ఆవరణలో సైతం మొత్తం బురదమయం కావడంతో వాహనాలు కదలని పరిస్థితి ఉందన్నారు. మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో 18 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి,3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికేతితకు అంతరాయం ఏర్పడిందని వివరించారు.
తాడిచెర్లలో బోగ్గు ఉత్పత్తికి అంతరాయం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES