Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్ధి సంఘం రద్దు రాజ్యాంగ విరుద్ధం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్ధి సంఘం రద్దు రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -

లింగ్డో కమిటీ సిఫార్సులు,విద్యార్ధి హక్కులు కాలరాస్తున్న యూనివర్శీటీ అడ్మినిస్ట్రేషన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం రద్దు రాజ్యాంగ విరుద్ధమని, లింగ్డో కమిటీ సిఫార్సులు, విద్యార్థి హక్కులను యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కాలరస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ అన్నారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటి గుర్తింపు విద్యార్ధి సంఘాన్ని పదవి కాలం పూర్తికాకముందే పక్షపాత ధోరణితో రద్దు చేయడం, కనీసం యూనియన్ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా యూనివర్శీటీ అడ్మినిస్ట్రేషన్ రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేయడం దుర్మార్గపు చర్య అని ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ అభిప్రాయపడుతుంది.

అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం లింగ్డో కమిటీ సిఫారసులను ,రాజ్యాంగం విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులకు కల్పించిన హక్కులను ఉల్లంఘన చేయడమే. క్యాంపస్ లో వైస్ ఛాన్సలర్ రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవరిస్తూ ఈ నిర్ణయం. తీసుకున్నారు. ఈ నిర్ణయం విద్యార్ధి హక్కులనే కాదు, యూనివర్శీటీల స్వయం ప్రతిపత్తిపై నేరుగా దాడి చేయడమే. యూనివర్శిటీ అడ్మీనిస్ట్రేషన్ తక్షణమే యూనియన్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లింగ్డో కమిటీ సిఫారసులను అమలు చేయాలని,రాజ్యాంగబద్దంగా గుర్తింపు సంఘం పదవీకాలం పూర్తిచేసుకునే అవకాశం కల్పించాలని‌‌ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఆజాద్, జీషణ్ , రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -