- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలో దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏర్పాటు చేసిన టేబుల్స్, సిబ్బంది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, త్రాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



