Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు 6 వేల బెంచీల వితరణ

కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు 6 వేల బెంచీల వితరణ

- Advertisement -

–  18 వేల విద్యార్థులకు ప్రయోజనం
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  ఆధ్వర్యంలో కె పి రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ సారథ్యంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం 6000 డెస్క్ బెంచీలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయనీ  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు , సాంఘిక సంక్షేమ పాఠశాలలు తదితర అన్ని విద్యాసంస్థల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే కామారెడ్డి ఎమ్మెల్యే లక్ష్యమని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో  పైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దాదాపు 18 వేల మంది విద్యార్థుల కోసం సుమారు రూ.4 కోట్ల వ్యయంతో 6000 డ్యూయల్ డెస్క్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుంచి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి పాఠశాలకు స్వయంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కృషి చేస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -