- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
బాబు జగ్జివన్ రాం జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ జీవిత చరిత్ర గ్రంథాలను ఆదివారం పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు సలేంద్ర రాజన్న యాదవ్ పలువురికి అందజేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, మహానుభావుల జీవిత చరిత్ర గ్రంథాలు పంపిణీ, వారి జయంతి, వర్థంతి వేడుకలు నిర్వహించడమే సొసైటీ లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ పాల్గొన్నారు.
- Advertisement -



