- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ లో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ సాయినాథ్ కలిసి కుభీర్ పశు వైద్యులు విశ్వజిత్ పశువులకు ఉచ్చితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు విశ్వజిత్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో మూడు నెలలు దాటిన పశువులకు ఈ టీకాలను వేయించాలని రైతులను సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చేర్మన్ కళ్యాణ్,ఆత్మకమిటి చేర్మన్ సిద్ధం వివేకానంద,పశు వైద్య సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



