- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని కాన్వాయిగూడెం గ్రామంలో మూగజీవాలకు సర్పంచ్ కాసాని హరీష్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశు వైద్య సహాయకులు వాంకుడోత్ అనిల్ తో కలిసి మాట్లాడుతూ.. పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు యజమానులు నట్టల నివారణ టీకాలు వేయించాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయించినట్లయితే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగయ్య, బుచ్చయ్య, అశోక్, చంద్రయ్య, సోమయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



