నవతెలంగాణ – ఆర్మూర్
అర్బన్ ప్రాంతం, మామిడిపల్లిలో ఉన్నటువంటి గొర్రెలు, మేకలకు వ్యాధులు రాకుండా నట్టల నివారణ మందులను తాగించడం జరిగిందని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జియాఉద్దీన్ సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరయ్య పర్యవేక్షించారు. జీవాల పెంపకందారులు పాల్గొని తమతమ జీవాలకు నట్టల నివారణ మందులను తాగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పశుసంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్, పశువైద్య సిబ్బంది రాజేశ్వర్, రాధ, దివ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నేడు చేపూరు , పల్లె గ్రామాల్లో కొనసాగుతుందని, కావున ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి జీవాల పెంపకందారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమతమ జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందులను తాగిపించుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



