- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో మంగళవారం గొర్రెలకు, మేకలకు ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై అందజేస్తున్న నట్టల నివారణ మందును గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, మండల పశువైద్యాధికారి రమ్ చందర్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు రమ్ చందర్ మాట్లాడుతూ…2150 జీవాలకు నట్టాల నివారణ మందును అందజేశామని, నట్టల నివారణ మందు యొక్క ఆవేశ్యకతను గొర్రెల, మేకల పెంపక దారులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్, పశు వైద్య సిబ్బంది ఎం ఎస్ రావు, నారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



