నవతెలంగాణ-జన్నారం
మండల కేంద్రానికి చెందిన కూర రవీందర్ అరుణ దంపతుల కుమార్తె శివ శ్రుతి, అల్లుడు శివ సుమన్ ల కుమారుడు శివ శ్రేయాన్స్ జన్మదినం సందర్భంగా తాత రవీందర్ అరుణ దంపతులు సోమవారం అక్క పెళ్లి గూడా ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో మనువడి జన్మదిన వేడుకలు నిర్వహించి రూ.15 వేల విలువ గల బ్యాండ్ ను పాఠశాలకు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల తరఫున ఆ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు పేరిట ఫంక్షన్లు చేసి డబ్బులు వృధా చేయకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన వస్తువు ను బహుమతి గా ఇవ్వడం అభినందించదగ్గ విషయమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాజాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శెట్టి రాజశేఖర్, తేజ సుదీప, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
మనవడి జన్మదినం సందర్భంగా పాఠశాలకు బ్యాండ్ వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



