నవతెలంగాణ – బోనకల్ : మండల పరిధిలోనే ముష్టికుంట్ల గ్రామంలో 5 అంగన్వాడీ కేంద్రాలకు రూ. 25 వేల విలువచేసే ఐదు బీరువాలను గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ చావా పురుషోత్తం తన పుట్టినరోజు సందర్భంగా గురువారం వితరణగా అందజేశారు. వృత్తి రిత్య హైదరాబాదులో స్థిరపడి ఆయన తన స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని తలంపుతో అంగన్వాడీ కేంద్రాలకు బీరువాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పిల్లల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బంధం నాగేశ్వరరావు లు మాట్లాడుతూ హైదరాబాదులో నివాసం ఉంటున్నప్పటికీ జన్మభూమిపై ఉన్న మమకారంతో అంగన్వాడీ కేంద్రాలకు బీరువాలను వితరణగా అందజేయటం అభినందనీయమన్నారు. ఈ బీరువాలను సద్వినియోగం చేసుకోవాలని అంగనవాడి టీచర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఐదు అంగనవాడి కేంద్రాల టీచర్లు, ఆయాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ముష్టికుంట్ల అంగన్వాడీ కేంద్రాలకు బీరువాలు వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



