సొసైటీ పౌoడర్స్ లింగమల్ల జ్యోతి-శంకరయ్య దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య దంపతుల ఆధ్వర్యంలో స్వర్గీయ నాస్తిక్ వెంకన్న 5వ వర్థంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం మహానీయుల జీవిత చరిత్ర గల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాస్తిక్ వెంకన్న గొప్ప గాయకుడని కొనియాడారు.5వ వర్థంతి సందర్భంగా వారి, చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సొసైటీ సంచార గ్రంథాలయం ఆద్వార్యంలో మహానీయుల జీవిత చరిత్ర గల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క వెంకటస్వామి,ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు మామిడిపెల్లి బాపన్న,కళాకారులు రామస్వామి,రాజనర్సు,నంబన్న, దుర్గయ్య,అనిల్, రవికుమార్,కాళేశ్వరం జోనల్ అధ్యక్షుడు కుమార్ యాదవ్,కార్యదర్శి బండి సుధాకర్ పాల్గొన్నారు.
మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలు పంపిణీ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES