నవతెలంగాణ – జుక్కల్
డాక్టర్ శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు డాక్టర్ కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామానికి యువ డాక్టర్ ఒక సంవత్సరం క్రితం సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చిన సందర్భంగా తిరుగు ప్రయాణంలో జోగిపేట్ వద్ద హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు మృతి పట్ల తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు.
మృతి చెంది ఒక సంవత్సరకాలం గడుస్తున్న సందర్భంగా బుధవారం యువ డాక్టర్ స్వగ్రామం పెద్ద ఎడ్గి లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు డాక్టర్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కలిసి కొడుకు జ్ఞాపకార్థం ప్రథమ జయంతి సందర్భంగా ఉచితంగా దుప్పట్లను జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతయ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల విద్యాధికారి, పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య , జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, కుటుంబీకులు , యువ డాక్టర్ తండ్రి కాడేం వార్ బలరాం, ప్రసాద్, పవన్, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES