Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాధశ్రమ చిన్నారులకు బుక్స్, పండ్లు పంపిణీ

అనాధశ్రమ చిన్నారులకు బుక్స్, పండ్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి మండలంలోని  భవానిపేట్ శివారు చిల్డ్రన్ హోమ్ లోని చిన్నారులకు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్  పెన్స్, డిక్షనరీ లు, పండ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి శుభాకాంక్షలు చెపుతూ కలవడానికి వచ్చే వాళ్లకి షాలువాలు,పూల బొకేలకి బదులుగా నోట్ బుక్స్,పెన్స్ ఇతర అవసరమైనా వస్తువలని ఇవ్వాలని చెప్పడం జరిగిందనీ అన్నారు.

దీనికి సహృదయంతో స్పందించిన వారు నోట్ బుక్స్,డిక్షనరీ లు ఇవ్వడం ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని వెంటనే మనకు దగ్గరలో ఉన్న ఆశ్రమం చిన్నారులకు నోట్ బుక్స్,పెన్స్,డిక్షనరీ, పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా దాతలు ఉంటే  సమాజ సేవలో ముందుండాలని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు శోభన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,బంగారు దేవదాసు,ఇటుకల శ్రీనివాస్, అక్షయ్,ప్రేమ్,ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -