- Advertisement -
నవ తెలంగాణ-మల్హర్ రావు : సత్యనారాయణ రాజు జ్ఞాపకార్థం తాడిచెర్ల ఓసిపిలో ఉద్యోగం చేస్తున్న అతని కుమారుడు డి.వి.పి రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తన తండ్రి ఆశయాలైన విద్య, సేవా భావం, మానవత్వం స్ఫూర్తితో పేద పిల్లల విద్యకు సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందారపు రాములు, సురేష్, పర్వతాలు పాల్గొన్నారు.
- Advertisement -



