- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
ఐసిడిఎస్ ప్రాజెక్టు జగిత్యాల ఆధ్వర్యంలో మండలంలోని అల్లీపూర్ అంగన్వాడి కేంద్రం-3లో సీడీపీవో మమత కుర్చీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ సహకారంతో ప్రీ స్కూల్ పిల్లలకు 20 చిన్న కుర్చీలు, గర్భిణీలు, బాలింతలకు 4 కుర్చీలు, 2 జంబు కానలు అందజేశారు. ఈ సందర్భంగా తల్లులు, పిల్లలు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్, ఏరియా మేనేజర్ నరసింహ, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాధా, అంగన్వాడి టీచర్ గంగు, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



