Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణీ..

విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాలమూరు ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో పదివేల చెస్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఏ ఎన్నారై శేఖర్ చల్ల ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ .. “ఎన్నారైలు తమ వంతు సహాయంగా పేద విద్యార్థులకు విద్యారంగంలో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయం. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి ఇలాంటి సహకారం ఎంతో దోహదం చేస్తుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, ఎంఈఓ చంద్రశేఖర్, ఎంపీడీవో మోహన్ లాల్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కృష్ణ, ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీను, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad