నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూలు యూనిఫామ్ లను సర్పంచ్ కంపదండి అశోక్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లను కుట్టించారు. అట్టి యూనిఫామ్ లను పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులను పాఠశాల తరఫున ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, వార్డు సభ్యులు బసిరి సురేష్, చిడబోయిన మధు, బసకొండ దేవేందర్, మామిడి ఆమని, ఈర్నాల లక్ష్మి, రాథోడ్ జ్యోతి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బసీరి అశోక్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు బట్టు బాలహంస, పాఠశాల ఉపాధ్యాయులు సాంబార్ కిషన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



