Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దసరా పండుగకు గిరిజనులకు బట్టలు పంపిణీ.!

దసరా పండుగకు గిరిజనులకు బట్టలు పంపిణీ.!

- Advertisement -

ప్రొపెసర్ జయశంకర్ పాండేషన్ ఆధ్వర్యంలో
నవతెలంగాణ – మల్హర్ రావు:
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సింగారం గ్రామ పంచాయితీ పరిధిలోని అడవి లోపల ఉన్న మద్దిమడుగు గ్రామంలోని ఆదివాసి గిరిజనులకు,వారి పిల్లలకు దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి ఆధ్వర్యంలో రూ.35,000 వేల విలువ గల కొత్త బట్టలను కొనుకొచ్చి వారికి అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ త్వరలో వీరికి సోలార్ స్ట్రీట్ లైట్స్, ప్రతి ఇంటికి సోలార్ లైట్స్ అందజేస్తామన్నారు.అలాగే దోమతెరలు,మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,సభ్యులు చింతల మనోహర్,మందారపు ఉదయ్ కుమార్,జంగము రాము,బూడిద సురేష్,రవి, స్వామి, మహేష్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -