నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణం బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో గత 12 రోజులుగా నిర్విరామంగా ఖోఖో శిక్షణా శిబిరం కొనసాగింది. శిక్షణ పొందిన క్రీడాకారులు గురువారం స్టేట్ మీట్ కు వెళ్తున్న క్రమంలో క్రీడా దుస్తులను ఎలైట్ ఇండియా ప్రాజెక్టు ప్రయివేట్ లిమిటెడ్ యాజమాన్యం పంపిణీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అడిగిన వెంటనే దుస్తులను పంపిణీ చేసిన ఎలైట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి మహాబూబ్ నగర్ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విలియం, ఆర్గనైజర్ గోకమళ్ళ రాజు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎలైట్ ఇండియా ఎండి నాగరాజు మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు, క్రీడాకారులకు, పేదలకు సహాయం చేయడమే మా లక్ష్యం అని వారు తెలిపారు. అతి తక్కువ ధరలకు మా ప్రాజెక్టులో ప్లాట్లు అందించబడును. మా సంస్థ ద్వారా పేద విద్యార్థులకు సేవ చేయడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేట్ మీట్ కు వెళ్తున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లిలో జరిగే ఖోఖో సీనియర్ బాలుర బాలికలు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఎలైట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఎండి రమేష్ యాదవ్, రాజేందర్, నగేష్, బాలరాజు, కార్యక్రమంలో వెల్దండ మండల టిఆర్ఎస్ నాయకులు జంగిలి ఆనంద్, డొక్కా , లింగమయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



