- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ పథకం చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అందుబాటులో లేకపోవడం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో మద్నూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు దేశాయ్ వెంకట్రావు ఈరన్న యువ నాయకులు హనుమాన్లు తదితరులు కలిసి మంజూరైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -