Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని పెద్దమల్లారెడ్డి, ఇస్సాన్నపల్లి, కంచర్ల గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చెక్కులను నేరుగా ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -