Saturday, September 27, 2025
E-PAPER
HomeNewsసీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆలూరు మండలంలోని కల్లేడి గ్రామ బీజేపీ నాయకులు శనివారం అందజేసినారు. వివిధ అనారోగ్యలతో బాధపడుతూ చికిత్సలు చేయించుకొని ముఖ్యమంత్రి సహయనీది కోసం దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబాల వారికి చెక్కులు దాదాపు 10 మంది బాధితులకు రూ.1 లక్ష 71,000/- చెక్కులు బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని, చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సహాయ నిధి ద్వారా డబ్బులు వచ్చే విధంగా కృషిచేసి ఆపత్కాలంలో ఆదుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్, బూత్ అధ్యక్షులు మచ్చర్ల అర్జీత్, అయిలి అరుణ్,బోడిగం నాగేష్, దినేష్ ప్రశాంత్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -