Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్ వితరణ

పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్ వితరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు దయానంద రెడ్డి మూడు కంప్యూటర్లు, ప్రింటర్ ను వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్ తెలిపారు. న్యావనంది గణేష్ సౌజన్యంతో జైడి రాజకుమార్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అభ్యర్థన మేరకు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డి పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్ అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో న్యావనంది గణేష్, జైడి రాజకుమార్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బషీరాబాద్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డి మూడు కంప్యూటర్లు, ఒక ప్రింటర్ సుమారు రూ. ఒక లక్ష 50వేల విలువగల పరికరాలను పాఠశాలకు అందజేసినట్లు తెలిపారు.

ఇటీవలే పాఠశాలకు సుమారు రూ.2లక్షల విలువగల 50 డ్యూయల్ డెస్క్   బెంచీలు అందించారన్నారు. బషీరాబాద్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ పరికరాలను, క్రీడా పరికరాలను అతి త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు.బషీరాబాద్ పాఠశాలతో పాటు మండలంలోని అనేక పాఠశాలలకు క్రీడా పరికరాలను, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్లు, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శివానంద్, కార్యదర్శి హరీష్, సభ్యులు రమేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -