- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి: మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా అందజేసిన వంట పాత్రలను సోమవారం పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఆంధ్రయ్య తెలిపారు. మండలంలోని 22 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలకు భోజనం తయారు చేయుటకు, వడ్డించుటకు అవసరం అయినా వంట పాత్రలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సురేందర్, ప్రవీణ్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ బి.అంజయ్య, పి. అంజయ్య, తదితరులు తెలిపారు.
- Advertisement -