Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోమన్ పల్లి పాఠశాలకు డెస్క్ బెంచ్ ల వితరణ

కోమన్ పల్లి పాఠశాలకు డెస్క్ బెంచ్ ల వితరణ

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని కోమన్ పల్లి ఉన్నత పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు దయానంద్ రెడ్డి వారి ట్రస్ట్ తరఫున 25 డ్యూయల్ డెస్క్  బెంచీలు బుధవారం అందజేశారు. విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా బెంచీలు అవసరాన్ని కోరగా వారు వెంటనే స్పందించి డెస్క్ బెంచీలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత దయానంద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వీటిని అందజేయడానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు కోకిల నాగరాజు , పి.డి రాజ్ కుమార్, చిట్టాపూర్ గణేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజగంగారం ,పాఠశాల ఉపాధ్యాయులు బి .వినోద్ , పి ఆర్ టి యు అధ్యక్షుడు గోపాల్ , చిన్నయ్య , భగవంతు రావు ,రాగ సుధ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -