నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం మచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజసేవకులు చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు దయానంద్ రెడ్డి వారి ట్రస్ట్ తరఫున 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు శుక్రవారం విరాళం అందించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెంచీల అవసరం ఉందని పాఠశాల నిర్వాహకులు తెలియజేయగా, వెంటనే స్పందించిన దయానంద్ రెడ్డి తమ ట్రస్ట్ ద్వారా సహాయం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పండరి, ఎంపీడీవో గంగాధర్ దయానంద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల అభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరం అని విద్యార్థుల కోసం డెస్క్ బెంచీలు అందించడం ద్వారా దయానంద్ రెడ్డి పాఠశాల అభివృద్ధికి చేసిన సహాయం ప్రశంసనీయమైనది అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ మర్చర్ల గ్రామ స్పెషల్ ఆఫీసర్ నితిష్ ,పంచాయతి సెక్రెటరీ నసీర్,వీడీసీ చెర్మెన్ ప్రసాద్, మల్లేష్, మాజీ సర్పంచ్ నర్సయ్య, విజయ్ కుమార్, ప్రవీణ్, దేవీదాస్,బాబన్న, కళ్యాణి, రవి తదితరులు పాల్గొన్నారు.
మచర్ల పాఠశాలకు డెస్క్ బెంచీల వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



