- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన, నిత్యవసర సరుకులు పాడైపోయిన బాధిత కుటుంబాలకు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు, న్యాయవాది రాజబాబు గౌడ్ సోమవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, శ్రీనివాస్, ప్రవీణ్, సిద్ధారెడ్డి, శ్రీకాంత్, కళ్యాణ్, సందీప్, తేజ, విష్ణు, వేణు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -