Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెరికిట్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ  

పెరికిట్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ  

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు నాలుగో వార్డ్ కౌన్సిలర్ సృజన్ కుమార్ 50 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పరీక్ష అట్ట, పెన్నులు పెన్సిల్ , స్కేల్ సామాగ్రిని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ఇష్టంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, మీ జీవిత లక్ష్యాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. పరీక్షలకు రివిజన్ వీలైనంత సార్లు చేసి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని రాసే విధంగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రాధ నోపాధ్యాయులు ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -