Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైస్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

హైస్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థుల పరీక్షలకు సహాయంగా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కాటారం గ్రామ సర్పంచ్ పంతకని సడవలి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంతకని సడవలి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ గొర్ల బానయ్య, వార్డు సభ్యులు కొండ రాజమల్లు, మంత్రి సునీల్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -