Monday, March 9, 2026
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్నేహం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సుమారు 50 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఈ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు ధైర్యంగా హాజరై మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ సందెల విక్రమ్, ట్రస్ట్ సభ్యులు అన్వేష్, సునీల్, విజయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -