Tuesday, February 24, 2026
E-PAPER
Homeజిల్లాలుపదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, స్కేల్లు వితరణ

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, స్కేల్లు వితరణ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
విద్యార్థులు చిన్నప్పటినుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా విద్యను అభ్యసించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న 51 మంది విద్యార్థినీ విద్యార్థులకు, రామానుజపురం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య జ్ఞాపకార్థం పరీక్ష ప్యాడ్లు, స్కేల్లు అందజేసి మాట్లాడారు. పేద ప్రజలకు సహాయం చేయాలనే వారి ఆశయాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అల్వాల ప్రవీణ్ కుమార్, మందడి కవిత, ఫిజికల్ డైరెక్టర్ కొండగడుపుల యాకయ్య, పాఠశాల ఉపాధ్యాయులు గుజ్జ భాస్కర్, సహదేవ్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -