నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని ధన్వాడ గ్రామ హైస్కూల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ దీప్తి స్కూల్ చైర్మన్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్యాడ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డుస్మరణ మాట్లాడుతూ..రాబోయే పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు శ్రమించి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కాటారం మండల అధ్యక్షులు, ధన్వాడ గ్రామ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాగర్ సమన్వయం చేశారు.



