Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ 

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన సైదాపురం జశ్విత పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో గల పాఠశాల విద్యార్థులకు గ్రామ ఉపసర్పంచ్ మౌనిక సురేష్ పరీక్ష పాడ్స్ పంపిణీ చేశారు. శనివారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్దేశించి మాట్లాడుతూ .. మా కూతురు జస్విత పుట్టినరోజు మా ఊరు పిల్లలు చదువుకునే ప్రభుత్వ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుట్టినరోజులు ఇంటిలో కాకుండా విద్యార్థుల సమక్షంలో లేదా పేద విద్యార్థులు హాస్టల్ పిల్లల మధ్యన జరుపుకోవడం వల్ల పెరిగి పెద్దయ్యాక ఐక్యమత్యం పెరుగుతుందన్నారు. కులాలు మతాలు లేని సమాజ నిర్మితం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు విరివిగా జరుపుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి వారికి విద్యాబుద్ధులు చెప్పాలన్నారుపుట్టినరోజు సందర్భంగా జశ్వితకు ఉపాధ్యాయులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఉపసర్పంచ్ కాగానే ప్రజల మధ్యన ఉండాలని ఆలోచనతో పిల్లలతో ఊరు పాఠశాలలో కూతురు పుట్టిన రోజు జరుపుకోవడం పట్ల ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -